నిరుద్యోగ యువతకు GOOD NEWS

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం రిజిస్ట్రేషన్ సెల్‌కు సంబంధించిన పోస్టర్‌ను కనిగిరిలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.