VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా తోపుగుంట–కలువాయి రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లలతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.