అక్రమ ఎరువుల నిల్వపై కేసు నమోదు

అక్రమ ఎరువుల నిల్వపై కేసు నమోదు

NDL: పాణ్యం మండలంలో అక్రమ ఎరువుల నిల్వపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం గడివేముల మండలం కరిమద్దెలలో ఆర్. బ్రహ్మానందంరెడ్డి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గడివేముల వ్యవసాయాధికారి పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.