'అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు'

కోల్‌కతా స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని అభిప్రాయపడ్డాడు. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని తెలిపాడు. కాగా, ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.