వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: ఎంపీపీ

కృష్ణా: ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. ఈ వేసవిలో మండలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.