'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో ఈనెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో ఎవరికైనా ఏమైనా కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకోవచ్చని చెప్పారు. ఇలా చేసుకోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.