ఆత్మకూరు ఘటన గుండెను కలచివేస్తోంది: మంత్రి

ఆత్మకూరు ఘటన గుండెను కలచివేస్తోంది: మంత్రి

NDL: ఆత్మకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన నలుగురు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం గుండెను కలచివేస్తోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.