30న సీఎం చంద్రబాబును కలుస్తాం: ఎమ్మెల్యే

ATP: జిల్లాలో పేదలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ FCRA రెన్యూవల్ విషయమై ఈ నెల 30న సీఎం చంద్రబాబును జిల్లా ఎమ్మెల్యేలందరం కలుస్తున్నామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ చేయకపోవడంతో జిల్లాలో ఆర్డీటీ సేవలు ఆగిపోయే పరిస్థితి ఉందని స్థానిక మహిళలు, నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.