VIDEO: శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.