గ్రామసభలో ప్రజా సమస్యలపై చర్చ

సత్యసాయి: లేపాక్షి మండలం శిరివరం పంచాయతీలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య, అసంపూర్తి అంగన్వాడీ, పాఠశాలలో క్రీడా మైదానం లేమి అంశాలు చర్చించారు. అర్జీలను పది రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడా మైదానానికి భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.