దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాసన్ నగర్‌లో మతిస్థిమితం లేని ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాట్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో సదరు యువతి ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.