సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
VZM: చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం నేటితో ముగింపు దశకు చేరుకుందనీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రేపు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి, కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీకి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స అనూష, నాయకులు పాల్గొన్నారు.