‘వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు మార్చాల్సిందే’
TG: మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేణుక ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ వంటి పవిత్ర నామాలను వైన్స్‌లకు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. వెంటనే ఆ పేర్లను తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి పేర్లు పెట్టకుండా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.