రేగొండలో నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
BHPL: రేగొండ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. సర్పంచ్ స్థానాలకు 138, వార్డు సభ్య స్థానాలకు 523 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో ఎం. వెంకటేశ్వర్ రావు తెలిపారు. పరిశీలనలో సర్పంచ్‌కు 138, వార్డులకు 515 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. రేపటి నుంచి నామినేషన్లపై అప్పీల్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది.