VIDEO: 'జీసీసీ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు'
VSP: విశాఖలోని గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కృష్ణకుమారి అనే మహిళ శనివారం నిరసన చేపట్టారు. రిటైర్ అయిన భర్తకు రావాల్సిన గ్రాడ్యుటీ కోసం ఏడాది నుంచి తిరుగుతున్నా స్పందన లేదని, అధికారులు లక్ష రూపాయలు లంచం అడుగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.