బోడుప్పల్‌లో 4.957 కేజీల గంజాయి చాక్లెట్ల పట్టివేత

మేడ్చల్: బోడుప్పల్ గౌతంనగర్‌లోని స్లమ్ ఏరియాలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రంగారెడ్డి ఎన్టీఎఫ్ టీమ్ దాడులు నిర్వహించారు. బీహార్కు చెందిన వీరేంద్రపండరీ అనే వ్యక్తి బీహార్ నుంచి తీసుకువచ్చిన గంజాయి చాక్లెట్లను అమ్ముతూ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు స్లమ్ ఏరియాల్లో ఈ చాక్లెట్లను రూ. 15 చొప్పున విక్రయిస్తున్నట్లు తేల్చారు.