కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ సీఎం
KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. బుధవారం పులివెందులలో మహేశ్వర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన అక్కడ సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా వైద్య సేవలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా YCP ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.