నందిగామలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
NTR: నందిగామలోని రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 కేజీల రేషన్ బియ్యాన్ని తహశీల్దార్ సురేశ్ బాబు పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక మయూరి థియేటర్ రోడ్డు సమీపంలో ఉన్న రేషన్ దుకాణంలో తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టాక్ లిస్టులో ఉన్న పంచదార 53 కేజీలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో ఉద్దండు సాహెబ్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.