అందెశ్రీ అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం
HYD: ప్రజాకవి అందెశ్రీ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రజల సందర్శనార్థం లాలాపేట్‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్‌లో ఆయన పార్థీవదేహాన్ని ఉంచారు. రేపు ఉదయం ఘట్‌కేసర్‌లోని NFC నగర్‌లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై అంతిమయాత్రలో పాల్గొననున్నారు.