హైడ్రాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు: రంగనాథ్
TG: HYD మూసీపేటలో హైడ్రాకు మద్దతు పలికిన నగరవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. వేల ఇళ్లను హైడ్రా కూల్చిందంటూ కొంతమంది చేస్తున్న దుష్ట్రచారాన్ని ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తిప్పి కొట్టిన వారికి ధన్యవాదాలు చెప్పారు. నగరాన్ని పర్యావరణ హితంగా, ప్రజలకు మెరుగైన జీవనాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పని చేస్తోందని వెల్లడించారు.