మోపిదేవి ఆలయంలో టీడీపీ నేతలు పూజలు

కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.