'అసాంఘిక చర్యలపై కఠిన చర్యలు'
అన్నమయ్య: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల నేరాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.