17న ఎన్నికలు జరిగే పాఠశాలలకు సెలవు
SRD: గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల అధికారులకు పాఠశాలలు అప్పగించాలని చెప్పారు.