జిల్లాలో తనిఖీలు మందుబాబులకు జరిమానా
SKLM: మందస పోలీసులు పలు రహదారుల్లో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ పై తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం సోంపేట కోర్టుకు తరలించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించినట్లు మందస ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు.