VIDEO: రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

WGL: దుగ్గొండి (M) వెంకటాపురం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు మద్దతుగా మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో BRS నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు జరగకపోవడంపై ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.