'శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు'

'శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు'

NLR: నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ కాలువలను ఆక్రమిస్తూ సమీప గృహాల వారు ఏలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని కమిషనర్ నందన్ తెలియజేశారు. బుధవారం ఏడవ డివిజన్లో ఆయన పర్యటించారు. డ్రైనేజీ కాలువల పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే ఇంటికి సంబంధించిన మెట్లు, ర్యాంపులు, తదితర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తామన్నారు.