గొర్ల దొడ్డిని ఆక్రమించిన సర్పంచ్

ప్రకాశం: మార్కాపురం మండలం బోడపాడులో యాదవుల గొర్ల దొడ్డిని వైకాపా సర్పంచ్ రమణారెడ్డి ఆక్రమించాడని యాదవులు పేర్కొన్నారు. రమణారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. యాదవులు తమ గొర్ల దొడ్డిని రమణారెడ్డిని ఖాళీ చేయించాలని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.