పాలకుర్తిలో అమరవీరుల వారోత్సవాలు

పాలకుర్తిలో అమరవీరుల వారోత్సవాలు

JN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో సీపీఎం నేతలు అమరవీరుల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య హాజరై మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటం భూసంస్కరణలకు నాంది పలికిందన్నారు. అనంతరం అమరుల కుటుంబాలకు సన్మానం చేశారు. అమరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీపీఎం ముఖ్య నేతలు పాల్గొన్నారు.