పశువులకు గాలికుంటు టీకాలు
ADB: నేరడిగొండ మండల పరిధిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండీ) నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. సావర్గం గ్రామంలోని పాడి పశువులు, ఎద్దులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కళ్యాణి హాజరై టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వాతావరణ మార్పుల సమయంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు.