ఉపాధి పనులు పరిశీలించిన ఎంపీడీవో

విజయనగరం జిల్లా: బొండపల్లి మండలంలోని నెలివాడ, గరుడబిల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో హరిహరరావు మంగళవారం పరిశీలించారు. నెలివాడలోని అనకన్నా చెరువు తోపాటు గరుడబిల్లి గ్రామంలో నారాయణ సాగరం చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వేతన దారుల మస్తర్లను పరిశీలించారు. గిట్టుబాటు ధర లభించేలా పనులు చేసుకోవాలని సూచించారు.