VIDEO: 'మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు'
ప్రకాశం: ఒంగోలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం సీఎం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమన్నారు.