నడిగూడెం-చాకిరాల మార్గంలో సుగమమైన ప్రయాణం
SRPT: శాంతినగర్-నడిగూడెం డబుల్ రోడ్డు విస్తరణలో భాగంగా, నడిగూడెం నుండి చాకిరాల బ్రిడ్జి వరకు తారు రోడ్డు పనులు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా రోడ్డుపై కంకర తేలి ఉండటంతో, ఈ మార్గంలో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రోడ్డు పనులు పూర్తికావడంతో ప్రయాణం సుఖమయంగా మారిందని, ప్రమాదాల భయం తప్పిందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.