హెల్మెట్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం
బాపట్ల: చందోలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై శివ కుమార్ ఆధ్వర్యంలో రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తూ, ప్రజలకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను వివరించి, రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.