కాపాడి పాలెంలో కార్డెన్ సెర్చ్
NLR: సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కపాడిపాలెంలో నెల్లూరు సబ్ డివిజన్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. పత్రాలు లేకుండా ఉన్న 19 బైకులతో పాటు ఆటోని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక్కసారిగా 50 మంది పోలీసులు సెర్చింగ్‌కి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.