ఎమ్మెల్యే నానికి వేదపండితుల ఆశీర్వచనం

తిరుపతి: చంద్రగిరి ఎమ్యెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన పులివర్తి నానిని శనివారం శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు తమ శిష్య బృందంతో కలిసి వేదాశీర్వచనం చేసి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే నానికి అమ్మవారి గజమాల, వస్త్రం అందజేసి ఘనంగా సత్కరించారు.