VIDEO: మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే
RR: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. వాయిదా పడిన ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ జరగనుండగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేరుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ఎన్నికల ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొంది.