అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ ఇవాళ పరిశీలించారు. కొత్త భవనం నిర్మాణం, వార్డుల ఆధునీకరణ, అత్యవసర సేవల విస్తరణ, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.