'గ్యాస్ సిలిండర్లపై గాలి వార్తలు రాస్తే కఠిన చర్యలు'

'గ్యాస్ సిలిండర్లపై గాలి వార్తలు రాస్తే కఠిన చర్యలు'

అన్నమయ్య: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని ప్రజలు గాలి వార్తలను నమ్మవద్దని సూచించారు.