యువకుడి దారుణ హత్య
KRNL: సి.బెళగల్ మండలం కె.శింగవరంలో మల్లేశ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నరికి చంపారు. తీవ్ర గాయాలతో మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ తబ్రేజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.