జువ్వాడి భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జగిత్యాల: కోరుట్ల నియోజకవర్గంలోని జువ్వాడి భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.