ఆకాశాన్నంటుతున్న 'కోడిగుడ్డు' ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కార్తీకమాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో గుడ్డు ధర రూ.4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.5.50 పలికింది. ప్రస్తుతం ఫారంలో రూ.6కు, రిటైల్‌లో రూ.7కు చేరింది. కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.