'కౌలు రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవచ్చు'
KMM: కౌలు రైతులు కూడా మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించుకోవడానికి అవకాశం కల్పించామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఓ ప్రకటనలో తెలిపారు. దళారుల బారిన పడకుండా పత్తిని మద్దతు ధరకు విక్రయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకుగాను కౌలు రైతులు సంబంధిత AEO వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.