మీర్జాగూడ ఘటన.. 20 మంది మృతి బాధాకరం: పవన్
TG: మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.