గ్రంథాలయ ఛైర్మన్‌కు ఘనంగా సన్మానం

గ్రంథాలయ ఛైర్మన్‌కు ఘనంగా సన్మానం

ATP: గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రను శనివారం టీడీపీ యువ నాయకులు కళ్యాణ కన్నా, ఆది తదితరులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. గ్రంథాలయ ఛైర్మన్‌గా నియామకమైన తర్వాత విజయవాడ నుంచి రైల్లో గుత్తికి ఆయన వచ్చారు. సమాచారం తెలుసుకున్న యువకులు నాగేంద్రను సన్మానించారు.