ఆలె నరేంద్రకు నివాళులర్పించిన బీజేపీ చీఫ్
HYD: మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తివారి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.