రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు

కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఎస్సై నాగరాజు సోమవారం గుడివాడలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, RC, పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు చలానాలు విధించారు.