సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GNTR: పెదకాకాని మండలంలో ఏడుగురు లబ్ధిదారులకు శుక్రవారం పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ సీఎం సహాయనిధి ద్వారా రూ. 9,08,300 చెక్కులను అందజేశారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం సహాయనిధి నిజమైన భరోసాగా నిలుస్తోందని అన్నారు.