మరువాడ గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

మరువాడ గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

VZM: వంగర మండలం మరువాడ గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభ దృష్ట్యా గ్రామంలో కాలువ పూడికతీత పనులు సిబ్బందితో చేయిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రెడ్డి నాగరాజు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, కాలువలో చెత్తను వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు అందజేయాలని కోరారు. ప్రజల తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు.