పదవ తరగతి విద్యార్థులకు విఘ్నేశ్వరుని పెన్నులు
కోనసీమ: పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల పదవ తరగతి పరీక్షలలో అందరూ ఉత్తీర్ణులు కావాలని పాఠశాల హెచ్ఎం ఎలిజబెత్ ఆకాంక్షించారు. వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన టీడీపీ యూనిట్ ఇన్‌ఛార్జ నిమ్మకాయల శేషు గురువారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి చెంతన ఉంచి పూజలు నిర్వహించిన పెన్నులు అందజేశారు.