డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

సత్యసాయి: హిందూపురం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మంగళవారం వార్షిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, పెండింగ్ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెట్టాలని, గంజాయి, పేకాట వంటి నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు.